Reading Time: < 1 minute

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘వారణసి’. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో మెగా ఈవెంట్ నిర్వహించి ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. అంతేకాదు 2027లో రిలీజ్ అవుతుందని చెప్పారు. అయితే రాజమౌళి సినిమా అంటేనే చెప్పిన సమయానికి విడుదల కావడం కష్టమే అని టాక్ ఉంది. దీంతో ఈ సినిమాపై చిత్ యూపి క్లారిటీ ఇచ్చింది

2027లోనే ‘వారణాసి’ విడుదల అవుతున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. తద్వారా మరోసారి క్లారిటీ ఇచ్చినట్లయింది. చాలామంది ఉగాది లేదా శ్రీరామనవమి కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రావొచ్చని అనుకుంటున్నారు. ఈ రెండు పండలు అంటే మరో ఏడాది మాత్రమే టైమ్ ఉంది. అప్పట్లో రాజమౌళి, సినిమాని సిద్ధం చేస్తారా అనేది చూడాలి? మహేశ్ అభిమానులు మాత్రం 2027లోనే రిలీజ్ అంటే అస్సలు నమ్మడం లేదు.