Reading Time: < 1 minute

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. ఈ కేసుతో మాజీ మంత్రి హరీష్ కు కూడా సంబంధమున్నట్లు అనుమానించి విచారణకు రావాలని ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సిట్ ఆదేశాల మేరకు విచారణకు హాజరైన హరీష్ రావుకు సిట్ అధికారులు.. ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని నెలల పాటు హరీష్‌ రావు ఫోన్‌ ట్యాప్‌ చేసినట్లు సిట్ అధికారులు చెప్పారు. హరీష్‌ రావు ఫోన్‌ ఎప్పుడు ట్యాప్‌ అయిందో.. ఆ తేదీలను పోలీసులు ఆయనకు ఇచ్చినట్లు తెలుస్తోంది. హరీష్ రావుతోపాటు ఆయన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్‌ అయినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వెనుక ముఖ్యంగా కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావులు ఉన్నట్లు కాంగ్రెస్, బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు.