Reading Time: < 1 minute

మనస్విని భాగ్యరాజా సమర్పణలో యువన్ కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిజ జీవితంలో భార్య భర్తలు అయిన వరుణ్ సందేశ్, వితికా షేరు హీరో హీరోయిన్లుగా కార్తీక్ భాగ్యరాజా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్‘. ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫిల్మ్‌మేకర్స్ మాట్లాడుతూ “చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే ఒక మహిళ కథే ‘డియర్ ఆస్ట్రోనాట్‘ చిత్రం. ఆకాశమే హద్దుగా తాను ఆస్ట్రోనాట్ అవ్వాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన పోరాటమే ఈ చిత్ర కథాంశం. వరుణ్ సందేశ్, వితికా షేరు అద్భుతంగా నటిస్తున్నారు”అని అన్నారు.