
డబ్ల్యూపిల్-2026లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టుకు అంతగా కలిసి రావడం లేదు. ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. మరో రెండు జట్లు కూడా అదే పాయింట్లతో ఉండటంతో ముంబై ఆ స్థానంలో ఉంటుందని గ్యారెంటీ లేదు.
అయితే ఈ పరిస్థితుల్లో ముంబై జట్టుకు మరో ఊహించని షాక్ తగిలింది. జట్టు కీలక ప్లేయర్ జి కమలిని గాయం కారణంగా పూర్తి సీజన్‌కు దూరమైంది. కమలిని ఈ సీజన్‌లో పెద్దగా రాణించకపోయినా.. జట్టుకు నమ్మదగిన బ్యాటర్‌గా ఉంది. ఆమె జట్టుకు దూరం కావడం తీరని లోటు అనే చెప్పుకోవాలి. అయితే ఆమె స్థానాన్ని మరో యువ ప్లేయర్ ఎడమచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మ భర్తీ చేయనుంది. వైష్ణవిని రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. 2025 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఆమె కీలక సభ్యురాలు. మరి డబ్ల్యూపిఎల్‌లో వైష్ణవి ఏ మాత్రం ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.