
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బిసిఎ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచుల్లో ముంబై 2 మ్యాచుల్లో విజయం సాధించి 4 పాయింట్లతో టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ ఆడిన 4 మ్యాచుల్లో కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచి 2 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నాలుగు మార్పులు చేసింది. గాయం కారణంగా దూరమైన కమలిని స్థానంలో వైష్ణవి శర్మను జట్టులోకి తీసుకుంది. ఇది వైష్ణవికి ఆరంగేట్ర మ్యాచ్ కావడం విశేషం. ఇక రహిలా ఫిర్దోస్ వికెట్‌కీపర్‌గా జట్టులోకి వచ్చింది. వీరిద్దరితో పాటు షబ్‌నమ్ ఇస్మైల్, పూనమ్ ఖేమ్నర్ జట్టులోకి వచ్చారు. ఢిల్లీ కూడా జట్టులో ఒక మార్పు చేసింది. 16 సంవత్సరాల దీయా యాదవ్‌ని జట్టులోకి తీసుకుంది.