Reading Time: < 1 minute

మారిషస్‌లో క్యాషియర్ (కనీసం 2 సంవత్సరాల అనుభవం), షెల్ప్ వర్కర్ (ఫ్రెషర్) ఉద్యోగాలకు అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుండి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ దరఖాస్తులను ఆహ్వానించింది. పై పేర్కొన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 20- నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని, ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలని, ఆంగ్లంలో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలని టామ్ కామ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. టామ్కామ్ తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ క్రింద ఒక రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, ఇది తెలంగాణా నుండి అర్హత కలిగిన నైపుణ్యం కలిగిన, సెమీస్కిల్ కార్మికులకు విదేశీ ప్లేస్‌మెంట్‌ను సులభతరం చేయడానికి ఒక నిర్దిష్ట ఆదేశంతో పనిచేస్తోంది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను tomcom.resume@gmail.com కు పంపించాలని సూచించింది. మరిన్ని వివరాలకు www.tomcom.telangana.gov.in ని సందర్శించవచ్చని, లేదా టామ్‌కామ్ ఫోన్ 94400 48590, 9440049937, 94400 51452 నంబర్లకు సంప్రదించ్చని సూచించారు.