Reading Time: < 1 minute

ముంబై: టీం ఇండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల విషయంలో బిసిసిఐ చిన్న చూపు చూస్తున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ కాంట్రక్ సిస్టమ్‌లో భారీ మార్పులు చేయడానికి బిసిసిఐ సిద్ధమైంది. ఈ క్రమంలో ‘ఎ ఫ్లెస్’ కేటగిరిని పూర్తిగా తొలగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రతిపాదించింది. దీనికి బోర్డు ఆమోదం తెలిపితే.. కోహ్లీ, రోహిత్‌పై ఎక్కువ ప్రభావం పడుతుంది. టి-20లు, టెస్టులకు గుడ్‌పై చెప్పి రో-కోలు ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కమిటీ చెప్పిన విధంగా ఎ ప్లస్ కేటగిరీని రద్దు చేస్తే వీరిరువురు ‘బి’ కేటగరిలోకి వచ్చే అవకాశం ఉంది.

అపెక్స్ కౌన్సిల్ తదుపరి సమావేశంలో తాజా ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది. ఆటగాలళ్ల స్థాయిని బట్టి చేస్తున్న ప్రదర్శనను బట్టి బిసిసిఐ ఏటా సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటిస్తుంది. ప్రస్తుతం ‘ఎ ప్లస్’ కేటగిరీలో కోహ్లీ, రోహఇత్, బుమ్రా, జడేజా ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.7 కోట్లు చెల్లిస్తారు. ఎ గ్రేట్‌లో ఉన్నవారికి రూ.5 కోట్లు, ‘ బి’ గ్రేడ్‌లో ఉన్న వారికి రూ.3 కోట్లు, ‘సి’ గ్రేడ్‌లో ఉన్న ప్లేయర్లకు రూ.కోటి చొప్పున బిసిసిఐ చెల్లిస్తుంది.