
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సోమవారంనాడు ఢిల్లీలో యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ఘనస్వాగతం చెప్పారు. మోదీ ఆయనను ఆత్మీయంగా కౌగలించుకున్న దృశ్యం వైరల్ అయింది. ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో ఈ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, తాను తన సోదరుడికి స్వాగతం చెప్పేందుకు స్వయం గా విమానాశ్రయానికి వచ్చినట్లు పేర్కొన్నారు.యుఏఇ అధ్యక్షుడు కేవలం భారతదేశంలో మూడు గంటలు మాత్రమే పర్యటించినా, ప్రధాని మోదీ చూపిన ఆదరణ అత్యంత స్పెషల్‌గా సాగింది. తన సోదరుడు, యుఏఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు స్వాగతం చేప్పేందుకు తాను స్వయంగా విమానాశ్రయానికి వెళ్లానని,
ఆయన పర్యటన భారతదేశం- యుఏఇ మధ్య బలమైన స్నేహ సంబంధాలకు, ఆయన ఇస్తున్న ప్రాముఖ్యతకు అద్దం పడుతోందని. అవగాహనతో కూడిన చర్చలకు తాను ఎదురు చూస్తున్నానని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇద్దరు నాయకులు ఒకే కారులో ఉల్లాసంగా మాట్లాడుకుంటూ విమానాశ్రయం నుంచి ప్రయాణించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో, ఇరాన్ – అమెరికా సంబంధాలు దెబ్బతిన్న వేళ, గాజాలో కొనసాగుతున్న అస్థిర పరిస్థితులు, సౌదీ అరేబియా, యుఏఇ మధ్య పరిష్కారం కాని యెమన్ వివాదం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మూడు గంటల పర్యటన జరిగింది. ప్రదాని మోదీ యూఏఇ ప్రెసిడెంట్‌తో కారులో ప్రయాణిస్తున్న చిత్రం, ఆత్మీయ ఆలింగనం ఇతర ఫోటోలను పంచుకోవడం విశేషం.