Reading Time: < 1 minute

మలయాళ స్టార్ మమ్ముట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్‌కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అతడు నటిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి హీరోయిన్‌ని పరిచయం చేస్తూ.. ఓ ప్రత్యేకమైన గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్.

ఈ సినిమా ద్వారా సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అవుతోంది. ‘‘నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి’’ అనే డైలాగ్‌తో ఈ గ్లింప్స్ ప్రారంభం అవుతోంది. ఈ సినిమాలో సాత్విక కనీస వసతులు కూడా లేని ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తుందని.. గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తుండగా.. గీత ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఈ ఏడాది వేసవి కాలంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.