Reading Time: < 1 minute

హైదరాబాద్: టెస్టుల్లో ఘోర ఓటమిని భారత జట్టు చవిచూడడంతో సెలక్షన్ కమిటీలో లోపాలు ఉన్నాయని క్రికెట్ పండితులు, అభిమానులు విమర్శించిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై ఇప్పుడు ఏకంగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ 2-1తేడాతో ఓడిపోవడంతో కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. మూడో వన్డేలో భారత జట్టు 41 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో భారత్ జట్టు 2-1 తేడాతో సిరీస్ ను కోల్పోయింది. భారత జట్టు సెలక్షన్ సరిగా లేదని క్రికెట్ పండితులు వాపోతున్నారు. బౌలింగ్ విభాగంలో కూర్పు సరిగా లేదని అభిమానులు మండిపడుతున్నారు. కెప్టెన్ కూడా మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని విమర్శలు వస్తున్నాయి. గిల్‌ను కూడా కెప్టెన్ నుంచి తొలగించి శ్రేయస్ అయ్యర్ ఇస్తే బాగుంటుందని క్రికెట్ అభిమానులు సలహాలు ఇస్తున్నారు. కోచ్‌గా గంభీర్ అట్టర్ ప్లాప్ అని, ఇలాంటి కోచ్ ను ఇప్పటి వరకు చూడలేదని మండిపడుతున్నారు. కోచ్ పదవి నుంచి గంభీర్ వైదొలగాలని అభిమానులు సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. జనవరి 21 నుంచి న్యూజిలాండ్ తో ఐదు ట్వి20ల సిరీస్ ఉంది. ఈ సిరీస్‌లో విఫలమైతే వెంటనే గంభీర్‌ను తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. టి20లోనైనా మంచి జట్టును సెలక్ట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. టి20లలో గంభీర్ ఒంటెద్దు పోకడలకు వెళ్తే ఓటమి ఖాయమని అభిమానులు హెచ్చరిస్తున్నారు.