
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలో టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజా వద్ద ట్రక్కు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చి ఆగి ఉన్న రెండు కార్లను ఢీకొంది. పూర్తిగా కార్లు ధ్వంసమయ్యాయి. రెండు కార్లతో పాటు ఉద్యోగిని కూడా 50 మీటర్ల దూరంలో ట్రక్కు ఈడ్చుకెళ్లింది. టోల్ ప్లాజా ఉద్యోగితో పాటు కారులో ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఫాస్ట్ ట్యాగ్ రీడర్ పనిచేయని కారణంగా.. టోల్ ప్లాజా సిబ్బంది రెండు కార్లను ఆపేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థ ఫాస్ట్ ట్యాగ్ కూడా..ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉందా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.