Reading Time: < 1 minute

 ప్రముఖ కళాకారుడు, గాయకుడు గడ్డం సంతోష్ వారి బృందంతో కలిసి తెలంగాణ కుంభమేళాగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా పాట రచించి, పాడి, వీడియో రూపంలో చిత్రీకరించిన సమ్మక్క సారక్క సీతక్క పాట సిడిని మంగళవారం ప్రజా భవన్ లో మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ పాటలో రాష్ట్ర మంత్రి సీతక్క కూడా తన గానం కలిపి సమ్మక్క సారక్కలపై ఉన్న భావోద్వేగాన్ని పంచుకున్నారు. సమ్మక్క సారక్క జాతర కోసం గడ్డం సంతోష్ వారి బృందం పాడిన పాటను రాష్ట్ర ప్రజలందరూ ఆదరించాలని మంత్రి సీతక్క వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం సంతోష్ వారి బృందం కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.