Reading Time: < 1 minute

కొత్త సంవత్సరం వేళ హైదరాబాద్ పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్‌ సందర్భంగా సిటీలో బుధవారం రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు పోలీసులు ప్రకటించారు. ఇవాళ రాత్రి నగరంలోకి ప్రైవేట్‌ బస్సులు రావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే, బేగంపేట్‌, టోలీచౌకి మినహా సిటీలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. విమాన ప్రయాణికులు ఫ్లైట్ టికెట్‌ ఉంటేనే పివి ఎక్స్‌ప్రెస్‌ వేపైకి అనుమతించనున్నారు. 

కొత్త సంవత్సరం వేడుకుల నేపథ్యంలో మందుబాబులకు హైదరాబాద్ సిపి సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. మద్యం తాగి రోడ్లపైకి వస్తే తప్పించుకోలేరని.. నేరుగా చంచల్ గూడ జైలుకే పంపిస్తామని ఆయన హెచ్చరించారు. నగరంలో 120 ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతామన్నారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానాలతో పాటు వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ర్యాష్ డ్రైవింగ్‌తో పాటు బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.