Reading Time: < 1 minute
వేడి ఆహారంతో నాలుక కాలిందా? నొప్పి తగ్గించి త్వరగా నయం చేసే చిట్కాలు

ఆహారం వేడి వేడిగా తినడం చాలా మంది ఇష్టపడతారు. కానీ, ఆహారం వేడిగా ఉన్నప్పుడు తొందరపడుతూ తింటే నాలుక కాలుతుంది. పిజ్జా, సూప్, కాఫీ లేదా ఏదైనా వేడి సూప్స్‌ వంటివి తింటున్న సమయంలో ఇలా నాలుక కాలడం చాలా సాధారణం. ఇలా నోర కాలటం వల్ల ఇతర ఆహారాలను తినడం కష్టం అవుతుంది. మీరు కూడా తరచూ ఇలాంటి సమస్యను ఎదుర్కొంటుంటే ఇది మీ కోసమే.. నాలుక కాలి ఇబ్బందిపడుతున్న వారికి త్వరగా నయం చేసుకోవడానికి ఒక సులభమైన మార్గం ఉంది. దాని గురించి మరింత తెలుసుకుందాం.

మీ నాలుక కాలిపోతే ఏం చేయాలి?

చల్లని నీరు తాగండి:

వేడి వేడి ఆహారం తిన్న తర్వాత నాలుక కాలిపోతే ముందుగా చల్లటి నీరు తాగాలని దంత పరిశుభ్రత నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది కాలిన ప్రాంతాన్ని చల్లబరుస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది.

మీ నోటిలో ఐస్ ముక్కను ఉంచుకోండి:

మీకు సౌకర్యంగా ఉంటే మీ నాలుకపై కొన్ని సెకన్ల పాటు చిన్నఐస్‌ ముక్కను ఉంచుకోండి. ఇది వాపు, నొప్పి రెండింటినీ తగ్గిస్తుంది. ఇలా పెట్టుకున్న ఐస్‌ని నమలకుండా జాగ్రత్త వహించండి.

కారంగా, వేడిగా, ఉప్పగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి:

నోటిలో కాలిన ప్రాంతం పూర్తిగా నయం అయ్యే వరకు చాలా వేడిగా, కారంగా లేదా ఉప్పగా ఉండే వాటిని తినకుండా ఉండండి. బదులుగా, పెరుగు, పుడ్డింగ్ వంటి మృదువైన ఆహారాలను తినండి.

చికాకు తీవ్రంగా ఉంటే నిపుణుడిని సంప్రదించిన తర్వాత మార్కెట్లో లభించే జెల్ లేదా తేలికపాటి నంబింగ్ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు.

నోటి పరిశుభ్రతను పాటించండి:

వీటన్నింటికీ మించి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి ప్రతిరోజూ బ్రష్, ఫ్లాస్ చేయండి. పడుకునే ముందు మీ నోటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..