Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) మాజీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా (84) ఆదివారం తుదిశ్వాస విడిచారు. బింద్రా 1993 నుంచి 1996 మధ్య బిసిసిఐ అధ్యక్షుడిగా పని చేశారు. అంతేగాక 1978 నుంచి 2014 వరకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన సేవలకు గుర్తింపుగా పిసిఎ క్రికెట్ స్టేడియానికి ఐఎస్ బ్రిందా పేరు పెట్టారు. తన పదవీ కాలం సమయంలో బింద్రా భారత క్రికెట్‌లో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. క్రికెట్ ప్రసారంలో దూరదర్శన్ గుత్తాధిపత్యానికి పుల్‌స్టాప్ పెట్టి ఈఎస్‌పిఎన్, టెన్ టివి వంటి ప్రపంచ సంస్థలను భారత మార్కెట్‌కు తేవలంలో ముఖ్య భూమిక పోషించారు. అంతేగాక 1987 ప్రపంచకప్ టోర్నీ భారత్‌లో నిర్వహించడంలో తనవంతు సహకారం అందించారు.