Reading Time: < 1 minute

ముంబయి: బాలీవుడ్ నటుడు తన ఇంట్లో పని చేసే మహిళపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి ప్రాంతం మలాద్ వెస్ట్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్వాణి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెర్సోవాలో నటుడు నదీమ్ ఖాన్ నివసిస్తున్నాడు. 2015లో ఓ మహిళ నదీమ్ ఇంట్లో పని మనిషిగా చేరింది. ఇద్దరు మధ్య పరిచయం ప్రేమగా మారడడంతో మాయమాటలతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకున్నాడు. పలుమార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా దాటవేసేవాడు. ఇద్దరు మధ్య పెళ్లి విషయంలో గొడవ జరగడంతో పెళ్లి చేసుకోనని నదీమ్ చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ‘దురంధర్’ సినిమాలో నదీమ్ నటించాడు.