
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ పతాకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సిఎస్, డిజిపి పాల్గొన్నారు. జాతీయ పతాకావిష్కరణ, జాతీయగీతాలాపన తరువాత రాష్ట్రగీతం ఆలాపన జరిగింది. పరేడ్ గ్రౌండ్‌లో సైనికుల గౌరవ వందనం గవర్నర్ స్వీకరించారు. అనంతరం జాతినుద్దేశించి జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు.