
అమరావతి: వైసిపి కార్యకర్త తన తండ్రి చనిపోతే మృతదేహాన్ని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో పూడ్చి పెట్టాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లా తుర్లుపాడు మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… గానుగపెంట ఎస్‌సి కాలనీలో వైసిపి నాయకుడు కిరణ్ తండ్రి మృతి చెందాడు. మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించారు. పాఠశాల, ఇండ్ల మధ్య ఉన్న ఆట స్థలంలో మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. స్కూల్ ఆట స్థలానికి సమీపంలో పూడ్చి పెట్టవద్దని గ్రామస్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్న వెంగయ్య అడ్డుకున్నారు. బడి పిల్లలు భయపడతారని చెప్పినా కూడా కిరణ్ వినకపోవడంతో గ్రామ పంచాయతీ అధికారి రామాంజనేయ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన చూసి చూడనట్టుగా వదిలేయడంతో తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహం పూడ్చిన చోట గొడ కట్టాలని కిరణ్‌కు ఎంఆర్‌ఒ సూచించారు.