Reading Time: < 1 minute

అమరావతి: భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా దూసుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశంలో స్టార్టర్ ఎకో సిస్టమ్ పుంజుకుంటోందని, సరికొత్త స్టార్టప్ లను దేశ యువత నెలకొల్పుతోందని అన్నారు. అనంతపురంలో 130వ మన్ కీ బాత్ లో ఆయన ప్రసంగించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మోడీ పిలుపునిచ్చారు. తమదైన రీతిలో యువత సమస్యలకు పరిష్కారం చూపుతోందని, కంపెనీలు తమ ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఓటరు దేశాభివృద్ధి ప్రయాణంలో భాగ్య విధాతని, వేలికి పడు చెరగని సిరా ముద్ర ప్రజాస్వామ్యానికి గౌరవ సూచిక అని తెలియజేశారు. యువ పారిశ్రామికవేత్తలకు సెల్యూట్ అని ప్రశంసించారు. ఈ జనరేషన్ యువతలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతోందని, అనంతపురంలో జల సంరక్షణతో పచ్చదనం పెరిగిందని మోడీ పేర్కొన్నారు.