Reading Time: < 1 minute

కరూర్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేటు బస్సు, స్కూటర్ ను ఢీకొట్టడంతో ఓ చిన్నారితో సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన కరూర్ జిల్లాలోని లాలాపెట్టై సమీపంలో చోటుచేసుకుంది. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో బస్సు వేగంగా దూసుకొచ్చిందని.. ఈ క్రమంలో స్కూటర్ పై వెళ్తున్న ఓ ఫ్యామిలీని ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. దీంతో తీవ్రంగా గాయపడి ఒక సంవత్సరం చిన్నారితో సహా ముగ్గురు కుటుంబ సభ్యులు స్పాట్ లోనే మృతి చెందారని చెప్పారు. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్ కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.