
చెన్నై: తమిళనాడు రాష్ట్రం మధురైలోని ఎల్‌ఐసి ఆఫీస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సినీయర్ మహిళా అధికారి చనిపోలేదని హత్య చేశారని విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అందలాపురమ్‌లోని ఎల్‌ఐసి ఆఫీస్‌లో టి రామ్(40) అనే వ్యక్తి అసిస్టెంట్ అడ్మినిస్టేటిల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. ఇదే ఆఫీస్‌ఃలో కల్యాణ్ నంబీ అనే మహిళ(54) సినీయర్ బ్రాంచ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె తిరునల్వెలీ నుంచి మధురైకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. బాధితులకు పరిహారం చెల్లింపులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగిన కల్యాణ్ గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై రామ్ కోపంతో రగిలిపోతున్నాడు. ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. డిసెంబర్ 17న రెండో అంతస్థులో కల్యాణ్ క్యాబిన్‌లో మంటలు చెలరేగడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. పక్కనే ఉన్న రామ్ కూడా స్వల్పంగా గాయపడడంతో రాజాజీ ఆస్పత్రికి తరలించారు.
ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె కుమారుడు తన తల్లి మరణంపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తన తల్లి పని చేసే క్యాబిన్‌లో పని వేళలో తెరిచి ఉంటాయని, ప్రమాదం జరిగినప్పుడు లాక్ చేసి ఉందని అనుమానం వ్యక్తం చేశాడు. రామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. గుర్తు తెలియని వ్యక్తి ఆఫీస్‌లో ప్రవేశించి ఆభరణాలు దొంగలించి ఆమె తగలబెట్టారని ఒకసారి జవాబు చెప్పాడు. బయటి వ్యక్తులు ఎవరు రాలేదని మరోసారి రామ్ చెప్పడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. కళ్యాణిపై పెట్రోల్ పోసి తగలబెట్టి అనంతరం క్యాబిన్ లాక్ చేసి బయటకు పరుగులు తీశానని వివరణ ఇచ్చాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.