Reading Time: < 1 minute

తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చేస్తున్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతుంది. ఇక, మంగళవారం శ్రీవారిని 73,788 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 23,449 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.65 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.