Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైసిపి కార్యకర్త మందా సాల్మన్ పై తెలుగుదేశం కార్యకర్తలు ఇనుపరాడ్డుతో దాడి చేయడంతో మృతి చెందాడు. రాజకీయ అండతోనే తన తండ్రిని టిడిపి నాయకుడు మోటమర్రి పేతురు, కార్యకర్తలు కిరాతకంగా హత్య చేశారని మందా సల్మాన్ కుమారులు ఆరోపణలు చేస్తున్నారు. తాము దళితులమే, సామాన్యులమే అంతా మాత్రాన తన తండ్రి ప్రాణాలకు విలువ లేదా? అని ప్రశ్నించారు. తండ్రిని కోల్పోయి తామంతా బాధలో ఉంటే స్థానిక టిడిపి నాయకుడు అవహేళన చేసి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉందని మృతుడి కుమారులు ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా తన తండ్రిని చంపిన వారిని శిక్షించాలని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామన్నారు. 

కూటమి అధికారంలోకి రాగానే టిడిపి నాయకుల బెదిరింపులతో సాల్మన్ ఊరు విడిచి వెళ్లిపోయాడు. ఇటీవ‌ల కుటుంబ సభ్యులను చూడటానికి పిన్నెల్లి గ్రామానికి వచ్చారు. ఎంత ధైర్యం ఉంటే మా ప్రభుత్వంలో గ్రామంలోకి వ‌స్తావా అంటూ సాల్మన్ పై తెలుగుదేశం నాయకుడు, కార్యకర్తలు రాడ్లతో దాడి చేశారు. తెలుగుదేశం నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పిడుగురాళ్లలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.