Reading Time: < 1 minute

నల్లమాడ: శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్లమాడు మండలం పులగంపల్లి వద్ద సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ, ఆర్టిసి బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.