Reading Time: < 1 minute

ఇండోర్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హోల్కర్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో న్యూజిలాండ్ ఆటగాళ్లు డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ రాణించారు. వీరిద్దరి అద్భుతమైన ఆటతో కివీస్ జట్టు భారత్‌ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన కివీస్‌కి భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. 5 పరుగుల వద్దే న్యూజిలాండ్‌వి రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు ఉన్న తరుణంలో క్రీజ్‌లో మిచెల్(137), ఫిలిప్స్(106) ఉన్నారు. వీరిద్దరు కలిసి 186 బంతుల్లో 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జత చేశారు. ఈ క్రమంలో ఇరువురు సెంచరీలు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ ఇద్దరిని అతి కష్టం మీద ఔట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో అర్ష్‌దీప్, హర్షిత్ చెరి 3, సిరాజ్, కుల్దీప్‌ తలో వికెట్ తీశారు.