
తమిళ స్టార్ హీరో దనుష్, కృతి సనన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘తేరే ఇష్క్ మే’. తెలుగులో అమరకావ్యం, గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా త్వరలో ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఇరోస్ ఇంటర్‌నేషనల్ ఈ సినిమాకు షాక్ ఇచ్చింది. గతంలో తమ సంస్థ నుంచి వచ్చిన ‘రంఝనా’ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ అని ప్రచారం చేశారని. కానీ, తమ నుంచి అనుమతి తీసుకోలేదని ఇరోస్ సంస్థ ముంబై హై కోర్టును ఆశ్రయించింది. నిర్మాణ సంస్థ ‘కలర్ ఎల్లో’, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారని, తమ ప్రతిష్టను దెబ్బ తీశారని, అందుకు గాను రూ.84 కోట్లు నష్టపరిహారంగా ఇప్పించాలని పిటిషన్ దాఖలు చేసింది. ‘రాంఝనా’లోని కొన్ని సన్నివేశాలు కూడా ‘తేరే ఇష్క్ మే’లో కానసాగాయని పేర్కొంది. ‘రాంఝనా’ కూడా ధనుష్, ఆనంద్.ఎల్.రాయ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అనే విషయం తెలిసిందే.