Reading Time: < 1 minute

అమరావతి: రైతు పండించిన పంటను కొనే నాధుడు లేడని వైసిపి మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ తెలిపారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్ బకాయిలు పేరుకుపోయాయని, పరిశ్రమల విషయంలో వైఎస్ఆర్ సిపి పై కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రభుత్వ భూముల్ని ఇస్తామంటే ఊరుకోమని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ మాటలు తప్ప పనిచేయడం లేదని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.