
ఇండోర్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో రెండు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని న్యూజిలాండ్ అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గత మ్యాచ్‌లో జట్టుతో బరిలో దిగుతోంది. భారత్ జట్టులో ఒక మార్పు చేసింది. ప్రశిద్ధ్ స్థానంలో అర్ష్‌దీప్‌ని జట్టులోకి తీసుకుంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్(కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వాయ్, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్(కెప్టెన్), జాకరీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్.