Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం అన్న‌మ‌య్య జిల్లా కె.వి.పల్లి మండలంలో దారుణం వెలుగులోకి వచ్చింది. అతిగా మద్యం సేవించి ఇద్దరు యువకులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. కెవి పల్లి మండలం బండ వడ్డీపల్లి సమీపంలో శనివారం సాయంత్రం ఆరుగురు కలిసి మొత్తం 19 బడ్‌వైజర్ బీర్లు సేవించారు. మణి కుమార్, పుష్పరాజ్ రాత్రి 8:15 గంటలకు అస్వస్థతకు గురై కుప్పకూలారు. వెంటనే వారిని గర్నిమెట్ట ప్రభుత్వాస్పత్రి, పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కె.వి పల్లి ఎస్‌ఐ విచారణ చేపడుతున్నారు. యువకుల మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి.  పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు వెల్లడించారు.