
హైదరాబాద్: హైదరాబాద్- విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద స్కూటీపై మహిళ, భర్త, కుమారుడు వెళ్తుండగా స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. భర్త కుమారుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గుర్రం గూడకు చెందిన దంపతులు చెరువు గట్టు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.