Reading Time: < 1 minute

బ్లాక్‌బస్టర్ ఫిల్మ్‌మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నూతన నటీనటులతో గుణ శేఖర్ నేటి యూత్‌కి, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. సమాజంలో యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ సమస్యలు, క్రైమ్ నేపథ్యంతో రా అండ్ ఇంటెన్స్‌గా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పారు. హీరోయిన్ సారా అర్జున్ మాట్లాడుతూ.. ఈ సినిమా తప్పకుండా అందరూ మెచ్చే సినిమా అవుతుందని తెలిపారు. సీనియర్ నటి భూమిక మాట్లాడుతూ..“పిల్లలను ఎలా పెంచాలి అనేది అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది” అని తెలియజేశారు. గుణశేఖర్ మాట్లాడుతూ..“ఈ సినిమాలో టీనేజర్ పాత్ర కోసం సారా అర్జున్‌ను తీసుకున్నాం. భూమిక పూర్తి స్క్రిప్ట్ చదివి వెంటనే ఓకే చెప్పింది. గౌతమ్ వాసుదేవ్ పాత్ర చాలా సహజంగా ఉం టుంది. కాల భైరవ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. 2026 చాలా నవ్వులతో ప్రారంభమైంది. ఫిబ్రవరి 6న మా యుఫోరియా సినిమాను తీసుకొస్తున్నాం. ఇది అందరూ కుటుంబంతో కలిసి చూడాల్సిన చిత్రం” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడ్డాల పృధ్వీరాజ్ పాల్గొన్నారు.