Reading Time: < 1 minute

మెగాస్టార్ చిరంజీవి పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఈ సంక్రాంతి సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లను పండుగ వేడుకలుగా మార్చింది. తెలుగు రాష్ట్రాలలో భారీగా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తోంది. మన శంకర వర ప్రసాద్ గారు 5వ రోజు ఏపీ,తెలంగాణలో పెద్ద సంఖ్యలో వసూళ్లు సాధించింది, గత రికార్డును బద్దలు కొట్టింది. పరిశ్రమలో అత్యధిక 5వ రోజు వసూళ్లు సాధించిన చిత్రంగా మన శంకర వర ప్రసాద్ గారు సరికొత్త రికార్డ్ సృష్టించింది. బుక్‌మైషోలో కేవలం ఐదు రోజుల్లో 2.5 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 226 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ఆరవ, ఏడవ రోజుల వసూళ్లు కూడా భారీగా ఉండబోతున్నాయి. అద్భుతమైన మౌత్ టాక్ తో థియేటర్లు హౌస్‌ఫుల్ షోలతో సందడి చేస్తున్నాయి.