Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుం ది. ఆదివారం (జనవరి 18) ప్రభుత్వం మే డారంలో కేబినెట్ జరుగనుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. నే డు సాయంత్రం 5గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం మేడారంలోని హరిత హోటల్‌లో జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో హైదరాబాద్ నగరం బయట మంత్రి మండలి సమావేశం జరగడం ఇదే తొలిసారి. దీనికోసం మంత్రి సీతక్క శనివారం ఉదయం నుంచి ఏర్పాట్ల గురించి అధికారులతో పర్యవేక్షించారు. సిఎం, మంత్రులు, వివిధశాఖల కార్యదర్శులు,

ఉన్నతాధికారులతో కలిపి సుమారు మూడు వందల మంది అక్కడ బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 28వ తేదీ నుంచి వనదేవతలు సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో ఈ కేబినెట్ మీటింగ్ అక్కడ ఏర్పాటు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.సిఎం పర్యటన, కేబినెట్ సమావేశం నేప థ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మునుపెన్నడూ లేనంత భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. సాధారణంగా రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ అవుతుంటోంది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒక మారుమూల గ్రామంలోనిర్వహించడం ఇదే తొలిసారి. మేడారంలో జరగబోయే కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మేడారంలో శాశ్వత ప్రాతిపాదికన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం భారీగానే నిధులు కేటాయించారు.

ఈ కేబినెట్ భేటీలో చర్చించే అంశాలు

ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్ర బడ్జెట్, మున్సిపల్ ఎన్నికలు, రైతు భరోసా వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ కీలక భేటీకి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారులకు సమాచారం అందింది. రైతు భోరోసా, హ్యామ్ రోడ్ల నిర్మాణం, మున్సి పల్ ఎన్నికలతో పాటు మరికొన్ని ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.