Reading Time: 3 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఈసారి ఎన్నికల్లో మ హిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బిసిలకు రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్‌లను కేటాయించగా మరో 30 జనరల్‌కు, జనరల్ మహిళకు 31 సీట్లను కేటాయించారు. ఈ ఎన్నిక లు జరుగనున్న పట్టణ, నగరపాలక సంస్థల్లోని వార్డులు, డివిజన్‌ల రిజర్వేషన్‌లను కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో ఖరారు చేశారు. ఈ రిజర్వేషన్లకు సంబంధించి వివరాలను పురపాలక శాఖ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ప్రకారం, బిసిలకు డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల 

ప్రకారం ఈ రిజర్వేషన్‌లను ఖరారు చేసినట్టు ఆమె తెలిపారు. ఎన్నికలకు సిద్ధమంటూ ఈ రిజర్వేషన్‌ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్టు శ్రీదేవి పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీలోగా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను జారీ చేయనున్నట్టుగా తెలిసింది.

రిజర్వేషన్ల కేటాయింపు ఇలా..

10 కార్పొరేషన్లలో ఒకటి ఎస్సీ (రామగుండం), ఒకటి ఎస్టీ (కొత్తగూడెం), 3 బిసిలకు (మహబూబ్‌నగర్ బిసి మహిళా, మంచిర్యాల, కరీంనగర్‌లను బిసి జనరల్‌కు కేటాయించారు. మరో 5 కార్పొరేషన్లు అన్ రిజర్వ్‌డ్ కింద కేటాయించారు. ఈ ఐదు కార్పొరేషన్లలో నాలుగు జనరల్ మహిళలకు కేటాయించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్‌కు కేటాయించగా, రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్‌కు, మహబూబ్‌నగర్ కార్పొరేషన్ బిసి మహిళకు అవకాశం కల్పించారు. ఇక, మంచిర్యాల కార్పొరేషన్ బిసి జనరల్, కరీంనగర్ కార్పొరేషన్ బిసి జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. హైదరాబాద్ జీహెచ్‌ఎంసి కార్పొరేషన్‌తో పాటు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లను జనరల్ మహిళకు, గ్రేటర్ వరంగల్ జనరల్ అభ్యర్థికి రిజర్వ్ చేశారు.

మున్సిపాలిటీలో రిజర్వేషన్‌ల వివరాలు..

కల్లూరు ఎస్టీ (జనరల్), భూత్పూర్ ఎస్టీ (జనరల్), మహబూబాబాద్ ఎస్టీ (జనరల్), కేసముద్రం ఎస్టీ (మహిళ), ఎల్లంపేట ఎస్టీ (మహిళ), స్టేషన్ ఘన్‌పూర్, ఎస్సీ (జనరల్), చొప్పదండి ఎస్సీ (మహిళ), జమ్మికుంట ఎస్సీ (జనరల్), హుజూరాబాద్ ఎస్సీ (మహిళ), ఏదులాపురం ఎస్సీ (మహిళ), డోర్నకల్ ఎస్సీ (జనరల్), లక్షెట్టిపేట ఎస్సీ (జనరల్), మూడుచింతలపల్లి ఎస్సీ (జనరల్), నందికొండ ఎస్సీ (జనరల్), మొయినాబాద్ ఎస్సీ (జనరల్), గడ్డపోతారం ఎస్సీ (మహిళ), కోహెర్ ఎస్సీ (జనరల్), ఇంద్రేశం ఎస్సీ (మహిళ), చేర్యాల ఎస్సీ (మహిళ), హుస్నాబాద్ ఎస్సీ (జనరల్), చేర్యాల ఎస్సీ (మహిళ), హుస్నాబాద్ ఎస్సీ (జనరల్), వికారాబాద్ ఎస్సీ (మహిళ), మోత్కూర్ ఎస్సీ (మహిళ), ఇల్లందు బిసి (మహిళ), జగిత్యాల బిసి (మహిళ), జనగామ బిసి (జనరల్), భూపాలపల్లి బిసి (జనరల్), అయిజ బిసి (జనరల్), వడ్డెపల్లి బిసి (జనరల్), అలంపూర్ బిసి (జనరల్), బిచ్కుంద బిసి (జనరల్), కామారెడ్డి బిసి (మహిళ)లకు కేటాయించారు.

అశ్వారావుపేట మహిళా (జనరల్)కు

ఇక, బాన్సువాడ బిసి (మహిళ), ఆసిఫాబాద్ బిసి (జనరల్), కాగజ్‌నగర్ బిసి (మహిళ), దేవరకద్ర బిసి (మహిళ), చెన్నూర్ బిసి (మహిళ), మెదక్ బిసి (మహిళ), ములుగు బిసి (మహిళ), కొల్లాపూర్ బిసి (మహిళ), అచ్చంపేట బిసి (మహిళ), నాగర్‌కర్నూల్ బిసి (జనరల్), దేవరకొండ బిసి (మహిళ), మద్దూర్ బిసి (జనరల్), పెద్దపల్లి బిసి (జనరల్), మంథని బిసి (జనరల్), వేములవాడ బిసి (జనరల్), షాద్‌నగర్ బిసి (జనరల్), జిన్నారం బిసి (జనరల్), జహీరాబాద్ బిసి (జనరల్), గుమ్మడిదల బిసి (జనరల్), సిద్ధిపేట బిసి (జనరల్), గజ్వేల్ బిసి (మహిళ), దుబ్బాక బిసి (మహిళ), హుజూర్‌నగర్ బిసి (జనరల్), తాండూరు బిసి (జనరల్), పరిగి బిసి (మహిళ), కొత్తకోట బిసి (మహిళ), ఆత్మకూర్ బిసి (మహిళ), నర్సంపేట బిసి (మహిళ), ఆలేరు బిసి (మహిళ), ఆదిలాబాద్ మహిళా (జనరల్), అశ్వారావుపేట మహిళ (జనరల్)కు కేటాయించారు.

భైంసా (అన్ రిజర్వుడ్)గా

వాటితో పాటు పరకాల (అన్‌రిజర్వ్), కోరుట్ల మహిళా(జనరల్) రాయికల్ (అన్‌రిజర్వ్), మెట్‌పల్లి, ధర్మపురి మహిళ (జనరల్), గద్వాల మహిళా (జనరల్), ఎల్లారెడ్డి (అన్‌రిజర్వ్), సత్తుపల్లి మహిళా (జనరల్), వైరా మహిళా(జనరల్), మధిర మహిళా (జనరల్), జడ్చర్ల (అన్ రిజర్వుడ్), తొర్రూర్ (అన్ రిజర్వుడ్), మరిపెడ మహిళా (జనరల్), కేతనపల్లి మహిళా (జనరల్), బెల్లంపల్లి మహిళా ( జనరల్), రామాయంపేట మహిళా (జనరల్), నర్సాపూర్ మహిళా (జనరల్), తూఫ్రాన్ మహిళా (జనరల్), అలియాబాద్ మహిళా (జనరల్), కల్వకుర్తి మహిళా (జనరల్), చండూర్ (అన్ రిజర్వుడ్), నకిరేకల్ (అన్ రిజర్వుడ్), హాలియా (అన్ రిజర్వుడ్), మిర్యాలగూడ మహిళా (జనరల్), చిట్యాల మహిళా (జనరల్), నారాయణపేట మహిళా( జనరల్), కోస్గి (అన్ రిజర్వుడ్), మక్తల్ (అన్ రిజర్వుడ్), ఖానాపూర్ (అన్ రిజర్వుడ్), భైంసా (అన్ రిజర్వుడ్) కింద కేటాయించారు.

చౌటుప్పల్ మహిళా (జనరల్)కు..

నిర్మల్ మహిళా (జనరల్)గా, భీంగల్ మహిళా (జనరల్), ఆర్మూర్ మహిళా (జనరల్), బోధన్ (అన్ రిజర్వుడ్), సుల్తానాబాద్ (అన్ రిజర్వుడ్), సిరిసిల్ల మహిళా (జనరల్), శంకరపల్లి (అన్ రిజర్వుడ్), చేవెళ్ల (అన్ రిజర్వుడ్), ఇబ్రహీంపట్నం (అన్ రిజర్వుడ్), ఆమన్‌గల్ (అన్ రిజర్వుడ్), కొత్తూరు (అన్ రిజర్వుడ్), సదాశివపేట మహిళా (జనరల్), నారాయణఖేడ్ (అన్ రిజర్వుడ్), ఆందోల్ జోగిపేట (అన్ రిజర్వుడ్), సంగారెడ్డి మహిళా (జనరల్), ఇస్నాపూర్ మహిళా (జనరల్), సూర్యాపేట (అన్ రిజర్వుడ్), తిరుమలగిరి (అన్ రిజర్వుడ్), కోదాడ మహిళా (జనరల్), నేరేడుచర్ల (అన్ రిజర్వుడ్), కొడంగల్ (అన్ రిజర్వుడ్), వనపర్తి మహిళా (జనరల్), అమరచింత (అన్ రిజర్వుడ్), పెబ్బేరు (అన్ రిజర్వుడ్), వర్ధన్నపేట (అన్ రిజర్వుడ్), పోచంపల్లి (అన్ రిజర్వుడ్), యాదగిరిగుట్ట మహిళా (జనరల్), భువనగిరి మహిళా (జనరల్), చౌటుప్పల్ మహిళా (జనరల్)గా రిజర్వేషన్‌లను డ్రా పద్ధతిలో కేటాయించారు.