Reading Time: < 1 minute

సంక్రాంతి పండుగ సెలవులు ముగించుకుని సొంతూళ్ల నుంచి తిరిగి హైదరాబాద్ బాట పట్టడంతో ఆంధప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే నేషనల్ హైవే 65పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా పెరి గింది. పొందుగుల బ్రిడ్జి, దామరచర్ల, మిర్యాలగూడ వంటి ప్రాంతాల్లో వాహనాలు అత్యంత నెమ్మదిగా కదులాయి. పంతంగి టోల్ ప్లాజా, చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులాయి. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో మూడు కిలో మీటర్ల మేర, అలాగే పెద్దకాపర్తి వద్ద రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కొర్లపహడ్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద రద్దీని నియంత్రించేందుకు పోలీసులు శ్రమించారు.

ఎన్‌హెచ్ 65 విస్తరణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరిం త పెరిగింది. దీన్ని అధిగమించడానికి పోలీసులు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించి దారి మళ్లించారు. విజయవాడ నుంచి వచ్చే భారీ వాహనా లను కోదాడ వద్దే నిలిపివేసి హుజూర్‌నగర్, మిర్యాలగూడ మీదుగా పంపారు. అలాగే అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై వచ్చే వాహనాలను మిర్యాల గూడ, హాలియా, మల్లేపల్లి మీదుగా హైదరాబాద్‌కు మళ్లించారు. హైవేపై రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో చిట్యా ల నుంచి భువనగిరి మీదుగా వాహనాలను పంపిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. డ్రోన్ కెమెరాలు, సిసిటివిల ద్వారా పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు.