Reading Time: < 1 minute

వైసిపినేత, మాజీ ఎంపి గోరంట్ల మాధవ్‌పై విజయవాడలోని పోక్సో ప్రత్యేక కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన సున్నితమైన వివరాలను బహిరంగంగా వెల్లడించారనే ఆరోపణలతో గోరంట్ల మాధవ్‌పై గతంలోనే పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఫిర్యాదును మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చారు. ఈ కేసు విచారణకు రావాలంటూ కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ గోరంట్ల మాధవ్ హాజరు కాకపోవడంతో, చివరకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే, తనపై జారీ అయిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను రీకాల్ చేయాలని కోరుతూ గోరంట్ల మాధవ్ సోమవారం కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.