Reading Time: < 1 minute

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జెఇఇ మెయిన్ సెషన్- 1 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ మేరకు శనివారం జెఇఇ మెయిన్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) శనివారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్‌సైట్ ద్వారా అడ్మిట్ కార్డులు పొందవచ్చు. దేశవ్యాప్తంగా జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జెఇఇ మెయిన్ పేపర్- 1 పరీక్ష, 29న పేపర్ -2 పరీక్ష జరగనున్నాయి. ప్రస్తుతానికి తొలి నాలుగు రోజుల అడ్మిట్ కార్డులను విడుదల చేయగా.. 28, 29 తేదీల్లో జరిగే పరీక్షలకు అడ్మిట్ కార్డులను తర్వాత విడుదల చేయనున్నారు. మొత్తం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టులో పరీక్షలు నిర్వహిస్తారు.