
గోల్కొండలో నిర్వహించిన హాట్ ఎయిర్ ఫెస్టివల్‌లో తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఓ ఎయిర్ బెలూన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా సమీపంలో ఉన్న ఇబ్రహీంబాగ్ చెరువు దగ్గర ల్యాండ్ కావడం…సకాలంలో స్థానికులు స్పందించి సాయం చేయడంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శుక్రవారం గోల్కొండ కోటలో హాట్ ఎయిర్ ఫెస్టివల్‌ను పెద్ద ఎత్తున నిర్వహించిన విషయం తెలిసిందే. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ బెలూన్ షోలో పాల్గోనేందుకు పోటీపడ్డారు.
అయితే, ఓ బెలూన్‌లో ఇద్దరు ప్రయాణిస్తుండగా, హఠాత్తుగా ఏర్పడిన సాంకేతిక లోపంతో సమీపంలోని ఇబ్రహీంబాగ్ చెరువు దగ్గర కిందికి దిగింది. అప్పటికే చీకటి కావడంతో భయానిక పరిస్థితి నెకలకొన్నది. అయితే, నిర్వాహకులు అప్రమత్తం కావడంతో సిబ్బందితో పాటు స్థానికులు సకాలంలో స్పందించి ఆదుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బెలూన్‌లో విహరించిన ఇద్దరు సురక్షితంగా ఉన్నారని, బెలూన్‌లో సరైన గాలి లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు.