Reading Time: < 1 minute

నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌-2026లో యుపి జట్టు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. డివై పాటిల్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో యుపి ముంబైని ఓడించడం ఇది రెండోసారి. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన యుపి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. యుపి బౌలర్ల పటిష్టంగా రాణించడంతో ముంబై టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. చివర్లో అమిలియా కెర్ర్(49), అమన్‌జ్యోత్ కౌర్(41) రాణించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేయడంతో.. యుపి 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. యుపి కెప్టెన్ మెగ్ లాన్నింగ్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.