
నగరంలోని కృష్ణానగర్ ప్రాంతంలో శనివారం ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నివాసంలో వాషింగ్ మెషిన్ ఒక్కసారిగా పేలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో బట్టలు ఉతకడానికి వాషింగ్ మేషిన్ ఆన్ చేసి ఉంచగా, అది రన్నింగ్‌లో ఉండగానే కొంత సమయానికి భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి వాషింగ్ మెషిన్ ముక్కలు ముక్కలుగా గాలిలోకి ఎగిరిపడింది. ఒక్కసారిగా సంభవించిన ఈ భారీ శబ్దానికి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆందోళ నకు గురయ్యారు. అయితే, అదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగిన సమయంలో మెషిన్ పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో తృటిలో ప్రాణాపా యం తప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే యూసుఫ్ గూడ పరిధిలోని కృష్ణానగర్‌లో సయ్యద్ గౌస్ కు రెండు ఫ్లోర్ల బిల్డిం గ్ ఉంది. సెకండ్ ఫ్లోర్ లోని పోర్షన్‌ను అద్దెకు తీసుకున్న సాంబశివారెడ్డి అనే వ్యక్తి అందులో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషిన్ ఆన్ చేయగా అందులో నుంచి మంటలు వచ్చాయి.
కాసేపటికి పొగతోపాటు పెద్ద శబ్దంతో వాషింగ్ మెషిన్ పేలిపోయింది. వాషింగ్ మెషిన్ ముక్కలుముక్కలైంది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంట లు ఆర్పివేశారు. ఈ దుర్ఘటనలో ఇల్లంతా చిందరవందర కాగా పలు వస్తువులు పాడైపోయాయి. అదృష్టవశాత్తూ ఇంట్లో ఎవరికీ గాయాలు కాలే దని సాంబశివారెడ్డి తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే, వాషింగ్ మెషిన్ ముక్కలు పక్కనే ఉన్న ఫ్రిడ్జ్‌ను బలంగా ఢీకొట్టడంతో అది కూడా పూర్తిగా పాడైందని, ఆస్తి నష్టం సంభవించిందని బాధి తులు ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక లోపం వల్ల లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నా రు. ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.