
నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యుపి బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన యూపికి ఆరంభంలోనే షాక్ తగిలింది. నికోలా కేరీ బౌలింగ్‌లో కిరణ్ నవ్గిరే (0) డకౌట్ అయింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కి వచ్చిన లిచ్‌ఫీల్డ్‌తో కలిసి కెప్టెన్ మెగ్ లాన్నింగ్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇద్దరు అర్థ శతకాలు సాధించారు. అమన్‌జోత్ కౌర్ బౌలింగ్‌లో లిచ్‌ఫీల్డ్(61) ఔట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత కొంత సమయానికే లాన్నింగ్(70) కూడా పెవిలియన్ చేరింది. అనంతరం హర్లిన్ (25), ట్రైయాన్(21) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత ఎవరూ రాణించలేకపోయారు దీంతో యుపి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ముంబై బౌలింగ్‌లో అమేలియా కెర్ర్ 3, స్కీవర్ బ్రంట్ 2, కేరీ, మ్యాథ్యూస్, కౌర్ తలో వికెట్ తీశారు.