Reading Time: < 1 minute

కన్నడలో స్టార్ అయినప్పటికీ.. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాలో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు సుదీప్. ఆ తర్వాత కూడా తెలుగులో ఆయన పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించారు. కాగా, సుదీప్ నటించిన రీసెంట్ చిత్రం ‘మార్క్’. ఈ సినిమాకు విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా కన్నడలో విడుదలైంది. ఆ సమయంలో తెలుగులో భారీ సంఖ్యలో సినిమాలు ఉండటంతో ఈ సినిమాకు తెలుగులో థియేటర్ల కొరత ఏర్పడింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

అయితే ఇఫ్పుడు ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 23న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సుదీప్ యాక్టింగ్, స్టైల్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయని రివ్యూలు వచ్చాయి. అయితే కథ చాలా బలహీనంగా ఉండటం.. ఆపై ఊహించదగిన ట్విస్టులతో కాస్త నిరాశపరిచిందని విమర్శలు వచ్చాయి. మొత్తానికి యాక్షన్ సన్నివేశాలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుందని చెప్పవచ్చు.