
హైదరాబాద్: పోలీసులు మొదట శాంతి ర్యాలీకి అనుమతిచ్చారని బిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం పోలీసులు తమ ర్యాలీ రూట్ మ్యాప్ పరిశీలించారని, ర్యాలీ అనుమతి రద్దు చేస్తున్నట్లు రాత్రి 11 గంటలకు మెసేజ్ పెట్టారని అన్నారు. తెలంగాణ భవన్ వద్ద తలసాని శ్రీనివాస్ వాహనం పోలీసులు అపేశారు. తలసాని వాహనం ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రాంత అస్థిత్వం దెబ్బతీసే విధంగా చేస్తున్నారని, శాంతి ర్యాలీని తాత్కాలికంగా అడ్డుకుని పైశాచిక ఆనందం పొందవచ్చునని విమర్శించారు. ర్యాలీకి అనుమతి లేదని అర్థరాత్రి చెబితే ఎలా? అని సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా? అని ప్రశ్నించారు. న్యాయపరంగా కోర్టు అనుమతి తీసుకుని ర్యాలీ నిర్వహిస్తామని, ఫిబ్రవరి మొదటి వారంలో ర్యాలీ నిర్వహిస్తామని తలసాని యాదవ్ పేర్కొన్నారు.