
ఇండోర్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ 1-1 తేడాతో సమంగా ఉన్న విషయం తెలిసిందే. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా.. రాజ్‌కోట్ వన్డేలో న్యూజిలాండ్ గెలిచింది. దీంతో ఆదివారం ఇండోర్ వేదికగా జరిగే మూడో వన్డే సిరీస్ డిసైడర్‌గా మారింది. అయితే ఇటీవల ఇండోర్‌లో కలుషిత నీరు వల్ల పలువురు మరణించారు. ఈ నేపథ్యంలో భారత టీమ్ మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
ఆటగాళ్లు బస చేస్తున్న ఫైవ్ స్టార్ హోటల్, మైదానంలో పరిశుభ్రమైన నీరు అందించే ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ.. టీం ఇండియా సారథి శుభ్‌మాన్ గిల్ తనకోసం ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాడు. ముందు జాగ్రత్త చర్యగా తాను బస చేస్తున్న హోటల్ గదిలో రూ.3 లక్షలు ఖరీదు చేసే వాటర్ ప్యూరిఫయర్‌ను బిగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరికరానికి ఆర్వో, ప్యాకేజ్డ్ వాటర్‌ని కూడా మళ్లీ ప్యూరిఫై చేసే సామర్థ్యం ఉన్నట్లు సమాచారం.