Reading Time: < 1 minute

పశ్చిమ బెంగాల్: అసోం, పశ్చిమ్ బెంగాల్ కు పూర్వ గౌరవం సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే.. పశ్చిమ్ బెంగాల్ అభివృద్ధి సాధ్యం అని అన్నారు. ఈ సందర్భంగా మోడీ పశ్చిమ బెంగాల్ లో ప్రసంగించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలున్నాయని తెలియజేశారు. జూట్ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈ సారి పశ్చిమబెంగాల్ లో బిజెపి గెలుస్తుందని, అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తుందని అన్నారు. జూట్ రైతులకు మరింత ప్రోత్సాహం, గ్యారెంటీ ఇస్తున్నానని.. జనపనారకు ఇచ్చే మద్దతుధరను రెండింతలు చేశామని మోడీ పేర్కొన్నారు. 11 ఏళ్లుగా జనసనార రైతులను ఆదుకుంటున్నామని, టిఎంసి పాలనలో ప్రజల ఆస్తులు, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 మమత బెనర్జీ ప్రభుత్వం అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందని, అక్రమంగా వలస వచ్చిన ప్రతి ఒక్కరినీ వెనక్కి పంపాలని అధికారులకు సూచించారు. బెంగాల్ ప్రజల రక్షణ కోసం తాము నిలబడతామని, అక్రమ చొరబాటుదారుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొరుగు దేశాల్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, పొరుగు దేశాల్లోని హిందూ శరణార్థులకు మనం రక్షణ కల్పిస్తున్నామని అన్నారు. శరణార్థుల కోసమే పౌరసత్వ సవరణ చట్టం తెచ్చామని, మీరు వేసే ఒక్క ఓటు పశ్చిమబెంగాల్ రాతను మారుస్తుందని జోస్యం చెప్పారు. మీరు బిజెపికి ఓటు వేస్తే పశ్చిమబెంగాల్ కు పూర్వ వైభవం వస్తుందని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.