Reading Time: < 1 minute

సంగారెడ్డి: చైనా మంజా ప్రాణాలు తీస్తోంది. బైక్ మీద బయటకు వెళ్తే చాలు చైనా మాంజా పీకలు కోస్తుంది. సంగారెడ్డి జిల్లాలో ఒకే రోజు రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. మారేపల్లిలో చైనా మాంజా యువకుడి గొంతు కోసింది. సాయిలు అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా అతడి మెడకు చైనా మాంజా చుట్టుకుంది. దీంతో అతడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. సాయిలు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రాయికోడ్‌లో సాయి కుమార్ అనే యువకుడి మెడకు చైనా మాంజా తగిలింది. వైద్యులు మెడకు నాలుగు కుట్లు వేశారు. తృటిలో సాయి కుమార్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గతంలో ఉప్పల్, కీసర, అంబర్ పేట, దిల్ సుఖ్ నగర్, సరూర్‌నగర్‌లో చైనా మాంజా తగిలి ద్విచక్రవాహనదారులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.