
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఎన్ జిఒ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి తల్లి చంపింది. అనంతరం ఉరేసుకుని తల్లి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎన్ జిఒ కాలనీలో ఉదయ్ కిరణ్, మల్లిక అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇషాన్ సాయి(2), పరిమిత(07 నెలలు) పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజులగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి దంపతలు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో పిల్లలను తీసుకొని బెడ్ రూమ్ లో వెళ్లి తల్లి లాక్ చేసుకుంది. ఉదయం నుంచి డోర్ తీయకపోవడంతో బలవంతంగా పగులుగొట్టి చూడగా మూడు మృతదేహాలు కనిపించాయి. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి చంపి అనంతరం భార్య ఉరేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను నంద్యాల జిజిహెచ్ కి తరలించారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.