
హైదరాబాద్: మేడారంలోని హరిత హోటల్ లో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. మేడారంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని మంత్రి వర్గం విచారణ జరపనుంది. పాలన హైదరాబాద్ కే పరిమితం కాదని సంకేతం ఇచ్చేందుకు అని తెలుస్తోంది. మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించినా ప్రభుత్వం సెలవు ప్రకటించలేదు. కేబినెట్ సమావేశంలో స్టేట్ హాలిడేపై నిర్ణయం, ములుగు నియోజకవర్గం అభివృద్ధిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ రిపోర్డర్ కు ఆమోదం, జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జితో కమిషన్ కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రేపు సాయంత్రం 5 గంటలకు మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.