
అమరావతి: ఎపిని భారతదేశ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దాలనే తమ సంకల్పామని సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు. శనివారం కాకినాడ ఎఎమ్ గ్రీన్ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టు మైలు రాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుగా కాకినాడ నిర్మించబడనుందని, 2024 అక్టోబర్ లో ఎపి సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం ప్రారంభించినప్పుడు చెప్పామని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారే దిశలో మరో కీలక అడుగు ముందుకు వేసిందని, కాకినాడ ఉత్పత్తులు.. జర్మనీతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్ కు ఎగుమతి అవుతుందని తెలియజేశారు. ఈ చారిత్రక ప్రాజెక్టు కార్యక్రమంలో తాను, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.