Reading Time: < 1 minute

హైదరాబాద్: కదులుతున్న ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగడంతో వాహనం దగ్ధమైంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నాటకకు చెందిన ఓ ప్రైవేటు బస్సు మంత్రాలయం నుంచి బెంగళూరు వెళ్తోంది. పత్తికొండ గ్రామ శివారులోకి చేరుకోగానే బస్సులో ఒక్కసారిగానే మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సు రోడ్డు పక్కన నిలిపి వేసి ప్రయాణికులను కిందకు దించారు. అప్పటికే బస్సు వ్యాప్తంగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. ప్రాణ నష్టం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.